సివిల్స్ ర్యాంకర్లలో 21 మంది తెలుగువారు కావడం గర్వకారణం: విజయసాయిరెడ్డి
- సివిల్స్ ఫలితాలు వెల్లడించిన యూపీఎస్సీ
- మొత్తం 685 మంది ఎంపిక
- అభినందనలు తెలిపిన విజయసాయి
జాతీయ స్థాయి సివిల్స్ లో 685 మంది అర్హత సాధించినట్టు యూపీఎస్సీ నేడు ప్రకటించింది. ఈ మేరకు ర్యాంకర్ల జాబితా విడుదల చేసింది. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. యూపీఎస్సీ సివిల్స్ లో ర్యాంకులు సాధించిన ప్రతిభావంతులకు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.
ఈసారి సివిల్స్ ర్యాంకర్లలో 21 మంది తెలుగువారు కావడం గర్వకారణమని కొనియాడారు. టాప్-25లో నిలిచిన యశ్వంత్ రెడ్డి (15వ ర్యాంకు), పూసపాటి సాహిత్య (24వ ర్యాంకు)లకు బెస్ట్ విషెస్ అని పేర్కొన్నారు. టాప్ 1, 2, 3 స్థానాలు మహిళలకే దక్కడం నారీశక్తికి ప్రతీక అని కీర్తించారు.