అమిత్ షాతో జగన్ భేటీ!.. ఢిల్లీ టూర్‌ను ముగించిన ఏపీ సీఎం!
- రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారంపై చర్చ
- అమిత్ షాతో భేటీ కోసమే గురువారం రాత్రి ఢిల్లీలోనే జగన్ బస
- ఈ భేటీ ముగియగానే తిరుగు ప్రయాణమైన జగన్
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారంపై అమిత్ షాతో జగన్ చర్చించినట్లుగా సమాచారం. రాష్ట్ర విభజన సమస్యలు పరిష్కారం కాకపోవడం వల్ల ఏపీకి జరుగుతున్న నష్టాన్ని అమిత్ షాకు జగన్ వివరించినట్లుగా సమాచారం. వీలయినంత త్వరగా రాష్ట్ర విభజన సమస్యలను పరిష్కరించాలని జగన్ ఆయనను కోరినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే...గురువారం ఢిల్లీ టూర్‌కు వెళ్లిన జగన్ నిన్ననే ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, గజేంద్ర సింగ్ షెకావత్‌లతో భేటీ అయ్యారు. అయితే అమిత్ షాతో భేటీ గురువారం సాధ్యపడలేదు. దీంతో రాత్రి ఢిల్లీలోనే బస చేసిన జగన్... శుక్రవారం ఉదయం 10 గంటలకు అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీ ముగిసిన వెంటనే ఆయన ఢిల్లీ నుంచి తిరుగుప్రయాణమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నానికే జగన్ తాడేపల్లి చేరుకున్నారు.