రజనీ సినిమాలో అన్నీ విశేషాలే!

  • రజనీ 169వ సినిమాకి సన్నాహాలు 
  • ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగు 
  • రజనీ భార్య పాత్రలో ఐశ్వర్యరాయ్ 
  • కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ
  • నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం  
రజనీకాంత్ తన నెక్స్ట్ సినిమా కోసం రెడీ అవుతున్నారు. కెరియర్ పరంగా ఆయనకి ఇది 169వ సినిమా. సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడు. ఆగస్టు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఈ సినిమాలో రజనీకి భార్య పాత్రలో ఐశ్వర్య రాయ్ నటించనుంది. 

'రోబో' తరువాత రజనీ - ఐశ్వర్యరాయ్ కలిసి నటించనున్న సినిమా ఇది. ఇక ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం రమ్యకృష్ణను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 'నరసింహా' సినిమాతో ఈ ఇద్దరూ కలిసి ఎలాంటి సంచలనానికి తెర తీశారనేది తెలిసిందే. అలాంటి ఒక పవర్ఫుల్ పాత్రలోనే రమ్యకృష్ణ కనిపించనుందని అంటున్నారు.

ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం ప్రియాంక అరుళ్ మోహన్ ఎంపిక జరిగిపోయింది. ఈ సినిమాలో ఒక యంగ్ హీరో జోడీగా ఆమె కనిపించనుంది. ఈ కథ రజనీకాంత్ రాసుకున్నదే కావడం .. కేఎస్ రవికుమార్ స్క్రీన్ ప్లే సమకూర్చడం మరో విశేషం. అనిరుధ్  ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.


More Telugu News