ఏపీ ఇంధ‌న శాఖ స్పెష‌ల్ సీఎస్‌గా విజ‌యానంద్ నియామ‌కం

  • మొన్న‌టిదాకా రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారిగా బాధ్య‌త‌లు
  • ఇటీవ‌లే ఆ ప‌ద‌విలో ముఖేశ్ కుమార్ మీనా నియామకం 
  • అప్ప‌టి నుంచి వెయిటింగ్‌లోనే ఉన్న విజ‌యానంద్‌
  • తాజాగా ఆయ‌న‌కు పోస్టింగ్ ఇస్తూ ఏపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు
ఏపీ కేడ‌ర్ సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి విజ‌యానంద్‌కు పోస్టింగ్ ఇస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వ బుధ‌వారం ఉద‌యం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇంధ‌న శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఆయ‌న‌ను ప్ర‌భుత్వం నియ‌మించింది. మొన్న‌టిదాకా రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారిగా విజ‌యానంద్ ప‌నిచేశారు. సుదీర్ఘ కాలం పాటు ఆ పోస్టులో ప‌నిచేసిన విజ‌యానంద్ ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల‌ను ప‌క్కాగా అమ‌లు చేశారన్న‌ గుర్తింపు తెచ్చుకున్నారు.

అయితే ఐదేళ్ల‌కు మించి రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారిగా ఏ ఒక్క అధికారి పని చేయ‌డానికి వీల్లేద‌న్న నిబంధ‌న మేర‌కు విజ‌యానంద్‌ను ఇటీవ‌లే కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పించింది. విజ‌యానంద్ స్థానంలో కొత్త‌గా ముఖేశ్ కుమార్ మీనా రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారిగా నియ‌మితుల‌య్యారు. ఈ క్ర‌మంలో గ‌త కొంత‌కాలంగా వెయిటింగ్‌లో ఉన్న విజ‌యానంద్‌కు ఇప్పుడు పోస్టింగ్ ఇస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.


More Telugu News