తిరుమల నడక దారి భక్తులకు గ్రీన్ మ్యాట్ స్వాగతం!
- నడకదారిలో కొంత భాగంలో ఏర్పాటు కాని పందిళ్లు
- ఈ ప్రాంతంలో భక్తుల కాళ్లు కాలిపోతున్నట్లు గుర్తించిన వైవీ సుబ్బారెడ్డి
- గ్రీన్ మ్యాట్లను ఏర్పాటు చేయాలంటూ ఆదేశాలు
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఓ గుడ్ న్యూస్ చెప్పింది. దేశ, విదేశాల నుంచి తిరుపతి చేరుకునే భక్తుల్లో చాలా మంది నడక దారిలోనే తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారు. అలా నడుచుకుంటూ వచ్చి మిమ్మల్ని దర్శించుకుంటామంటూ చాలా మంది భక్తులు శ్రీవారికి మొక్కుకుంటున్న విషయం కూడా తెలిసిందే.
అయితే కిలో మీటర్ల మేర పొడవున్న నడక దారిలో మెజారిటీ భాగంలో భక్తులకు ఎండ తగలకుండా పందిళ్లను టీటీడీ చాలా కాలం క్రితమే ఏర్పాటు చేసింది. అయితే కొంత ప్రాంతంలో మాత్రం భానుడి భగభగలను భరిస్తూనే భక్తులు తిరుమల కొండ ఎక్కాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని గమనించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పందిళ్లు లేని ప్రాంతంలో భక్తుల కాళ్లు కాలకుండా గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేయించారు.
ఇటీవలే నడక దారి మార్గాన్ని పరిశీలించిన సుబ్బారెడ్డి పందిళ్లు లేని ప్రాంతంలో భక్తులు పడుతున్న ఇబ్బందులను గుర్తించారు. పందిళ్లు లేని ప్రాంతంలో గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేయాలని ఆయన అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సుబ్బారెడ్డి ఆదేశాలు జారీ చేసిన 24 గంటల్లో నడక దారిలో గ్రీన్ మ్యాట్ వచ్చి చేరింది.