విశాఖలో భారీ క్యాంప‌స్‌పై ఇన్ఫోసిస్ ప్ర‌క‌టన ఇదిగో!

  • విశాఖ‌లో క్యాంప‌స్‌పై ఇన్ఫోసిస్ క్లారిటీ
  •  తొలి ద‌శ‌లో 1,000 సీటింగ్ కెపాసిటీ 
  • విశాఖ‌తో పాటు మ‌రో ఐదు న‌గ‌రాల్లోనూ ఇన్ఫీ క్యాంప‌స్‌లు
ఏపీలోని విశాఖ కేంద్రంగా భారీ క్యాంప‌స్ ఏర్పాటుకు దేశీయ ఐటీ దిగ్గ‌జం ఇన్ఫోసిస్ సంసిద్ధ‌త వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంపై ఏపీ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఓ ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేసింది. ల‌క్ష చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న ఈ క్యాంప‌స్‌లో తొలి ద‌శ‌లో 1,000 సీటింగ్ కెపాసిటీ ఉండేలా ఇన్పోసిస్ ప్లాన్ చేస్తోంద‌ని, ద‌శ‌ల‌వారీగా దానిని 3 వేల సీటింగ్ కెపాసిటీకి పెంచ‌నుంద‌ని కూడా రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

తాజాగా విశాఖ‌లో భారీ క్యాంప‌స్ ఏర్పాటుకు సంబంధించి ఇన్ఫోసిస్ కూడా ఓ ప్ర‌క‌ట‌న చేసింది. విశాఖతో పాటు నాగపూర్‌, కోల్‌క‌తా, ఇండోర్‌, కోయంబ‌త్తూర్‌, నోయిడాల్లోనూ కొత్త‌గా త‌న క్యాంప‌స్‌ల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లుగా ఆ సంస్థ త‌న ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.


More Telugu News