ఏక్‌నాథ్ షిండే యూ టర్న్.. ఆ మహాశక్తి బీజేపీ కాదన్న రెబల్ నేత
- తన ‘మహాశక్తి’ వ్యాఖ్యల వెనక వేరే ఉద్దేశం ఉందన్న షిండే
- ఆ మహాశక్తి బాలాసాహెబ్ థాకరే, ఆనంద్ దిఘేలా అని వివరణ
- జాతీయ పార్టీ ఏదీ తమను సంప్రదించలేదని స్పష్టీకరణ
శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ షిండే మాట మార్చారు. తమ వెనక శక్తిమంతమైన జాతీయ పార్టీ ఉందని చెప్పి 24 గంటలు కూడా గడవకముందే ఆయన యూటర్న్ తీసుకున్నారు. తమ క్యాంపును సూరత్ నుంచి గువాహటికి మార్చిన షిండే మొన్న మాట్లాడుతూ.. తమకు ఓ మహాశక్తి అండ ఉందని, ఎలాంటి సాయమైనా చేసేందుకు సిద్ధంగా ఉందంటూ పరోక్షంగా బీజేపీని ప్రస్తావించారు. నిన్న ఇదే విషయమై ఓ టీవీ చానల్ అడిగిన ప్రశ్నకు షిండే బదులిస్తూ .. జాతీయ పార్టీ ఏదీ తమను సంప్రదించలేదన్నారు.
రెబల్ గ్రూపునకు బీజేపీ మద్దతు ఉందా? అన్న ప్రశ్నకు షిండే బదులిస్తూ.. జాతీయ పార్టీ ఏదీ తమను సంప్రదించలేదని స్పష్టం చేశారు. తాను చేసిన ‘మహాశక్తి’ వ్యాఖ్యలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మహాశక్తి అని చెప్పడం వెనక వేరే ఉద్దేశం ఉందని, దివంగత నేతలైన బాలాసాహెబ్ థాకరే, ఆనంద్ దిఘేలాను ఉద్దేశించే తానా వ్యాఖ్యలు చేసినట్టు చెప్పారు.