ఢిల్లీలో పట్టు నిలుపుకున్న ఆప్... రాజిందర్ నగర్ ఉప ఎన్నికలో దుర్గేశ్ గెలుపు
- మొన్నటిదాకా రాజిందర్ నగర్ ఎమ్మెల్యేగా రాజీవ్ చద్దా
- రాజీవ్‌ను రాజ్యసభకు నామినేట్ చేసిన ఆప్
- ఉప ఎన్నికల్లో దుర్గేశ్ పాఠక్ విజయం
ఢిల్లీలో గత కొంతకాలంగా అధికార పార్టీగా కొనసాగుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లోనూ సత్తా చాటింది. ఢిల్లీలోని రాజిందర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆప్ అభ్యర్థిగా బరిలోకి దిగిన దుర్గేశ్ పాఠక్ విజయం సాధించారు. ఈ నెల 23న పోలింగ్ జరగగా... ఆదివారం ఓట్ల లెక్కింపు జరిగింది.
కాసేపటి క్రితం ముగిసిన ఓట్ల లెక్కింపులో ఆప్ అభ్యర్థి దుర్గేశ్ ఘన విజయం సాధించారు. రాజిందర్ నగర్ నుంచి మొన్నటిదాకా ఆప్ నేత రాజీవ్ చద్ధా ఎమ్మెల్యేగా కొనసాగారు. అయితే ఇటీవలి రాజ్యసభ ఎన్నికల్లో రాజీవ్ చద్ధాను ఆప్ రాజ్యసభకు నామినేట్ చేసింది. దీంతో రాజిందర్ నగర్‌కు ఉప ఎన్నిక అనివార్యం కాగా... ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి దుర్గేశ్ పాఠక్ విజయం సాధించారు.