కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి అడుగు పెట్టిన సరికొత్త మారుతి బ్రెజ్జా
- అధికారికంగా విడుదల చేసిన మారుతి సుజుకీ
- ఎక్స్ టీరియర్ డిజైన్ లో స్పష్టమైన మార్పు
- క్యాబిన్ లో పలు అదనపు సదుపాయాలు
- ఇప్పటికే 45,000 బుకింగ్ లు
మారుతి సుజుకీ కంపెనీ.. 2022 ఎడిషన్ మారుతి బ్రెజ్జాను గురువారం మార్కెట్లో విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.7.99 లక్షల నుంచి మొదలవుతుంది. 2016లో తొలిసారి బ్రెజ్జాను మారుతి విడుదల చేయగా, ఇప్పటి దాకా 8 లక్షలకు పైగా యూనిట్లను విక్రయించింది.
సబ్ కాంపాక్ట్ ఎస్ యూవీ అయిన బ్రెజ్జాను కస్టమర్లు బాగానే ఆదరిస్తున్నారు. దీంతో మారుతి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను జోడిస్తోంది. ఈ విడత బ్రెజ్జా డిజైన్ లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా ముందు, వెనుక భాగాలు కొత్తదనాన్ని సంతరించుకున్నాయి. క్యాబిన్ లో సదుపాయాలను పెంచింది. ఈ కొత్త ఎడిషన్ కోసం ఇప్పటికే 45,000 మంది బుక్ చేసుకోవడం గమనార్హం.
ఎల్ఈడీ లైట్ల గ్రిల్, అలాయ్ వీల్ డిజైన్ భిన్నంగా కనిపిస్తున్నాయి. ఎలక్ట్రిక్ సన్ రూఫ్, 360 డిగ్రీల కోణంతో కారు చుట్టూ ఉన్న వాటిని లోపల స్క్రీన్ పై చూసే అవకాశం, తొమ్మిది అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్ స్క్రీన్, వాయిస్ అసిస్ట్, ఆర్కమిస్ సహకారంతో అత్యాధునిక మ్యూజిక్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్ ఫీచర్లు ఉన్నాయి. ఆరు ఎయిర్ బ్యాగులు, హిల్ రోడ్ అసిస్టెన్స్, ఏబీఎస్, ఈబీడీ తో ఈ కారు లభిస్తుంది.