సంఖ్యా బలం మాకే ఉంది... గవర్నర్ ను కలిసి వివరించిన ఫడ్నవీస్, ఏక్ నాథ్ షిండే

  • మహారాష్ట్రలో ఆసక్తికరంగా రాజకీయాలు
  • ముంబయి వచ్చి ఫడ్నవీస్ ను కలిసిన ఏక్ నాథ్ షిండే
  • ఇరువురూ గవర్నర్ తో భేటీ
  • తాజా సమీకరణాలపై గవర్నర్ కు వివరణ
మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. కాబోయే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని కలిశారు. ప్రస్తుత సమీకరణాల పరంగా ప్రభుత్వ ఏర్పాటు తమకే సాధ్యమని, సంఖ్యాపరంగా ఎక్కువమంది ఎమ్మెల్యేల బలం తమకే ఉందని ఈ సందర్భంగా ఫడ్నవీస్ ఉద్ఘాటించారు. రేపటి ప్రమాణస్వీకారం సందర్భంగా కొద్దిమంది మంత్రులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. 

శివసేనలో ఏక్ నాథ్ షిండే రూపంలో పుట్టిన ముసలం ఏకంగా ఉద్ధవ్ థాకరే సీఎం పదవినే బలితీసుకుంది. థాకరే వర్గానికి 13 మంది ఎమ్మెల్యేలు మిగలగా, 40 మందికి పైగా ఎమ్మెల్యేలతో షిండే వర్గం మరింత బలోపేతమైంది. బలనిరూపణకు రావాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేయగా, వాస్తవ పరిస్థితుల నేపథ్యంలో ఉద్ధవ్ థాకరే సీఎం పదవికి ముందే రాజీనామా చేశారు.


More Telugu News