తెలంగాణ అధికార భాషా సంఘం చైర్ పర్సన్ గా మంత్రి శ్రీదేవి నియామకం
- తెలంగాణలో పలు పదవులకు నియామకాలు
- ఉర్దూ అకాడమీ అధ్యక్షుడిగా మహ్మద్ ఖాజా ముజీబుద్దీన్
- తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ గా మేడె రాజీవ్ సాగర్
తెలంగాణ సీఎం కేసీఆర్ వివిధ పదవులకు నియామకాలు చేపట్టారు. తెలంగాణ అధికార భాషా సంఘం చైర్ పర్సన్ గా మంత్రి శ్రీదేవిని నియమించారు. తెలంగాణ ఉర్దూ అకాడమీ అధ్యక్షుడిగా మహ్మద్ ఖాజా ముజీబుద్దీన్ కు బాధ్యతలు అప్పగించారు. అటు, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ గా మేడె రాజీవ్ సాగర్ ను నియమించారు. సీఎం ఆదేశాల మేరకు పై నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, తెలంగాణ ఏర్పడ్డాక అధికార భాషా సంఘం తొలి చైర్మన్ గా దేవులపల్లి ప్రభాకర్ రావు (84) నియమితులయ్యారు. ఆయన ఇటీవలే మరణించారు.
కాగా, తెలంగాణ ఏర్పడ్డాక అధికార భాషా సంఘం తొలి చైర్మన్ గా దేవులపల్లి ప్రభాకర్ రావు (84) నియమితులయ్యారు. ఆయన ఇటీవలే మరణించారు.