సర్వీస్ చార్జీకి చెల్లు!...హోటళ్లు, రెస్టారెంట్ల బాదుడుకు కళ్లెం పడినట్టే!
- హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్ చార్జీల పేరిట బాదుడు
- బిల్లుపై జీఎస్టీతో పాటు సర్వీస్ చార్జీలు అదనం
- ఇకపై సర్వీస్ చార్జీలు వసూలు చేయరాదని కేంద్రం ఆదేశం
హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లిన సమయంలో బిల్లుతో పాటు సర్వీస్ చార్జీల పేరిట అదనపు బాదుడు తప్పడం లేదు కదా. ఇకపై ఆ బాదుడు నుంచి జనానికి ఉపశమనం లభించనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సర్వీస్ చార్జీలను రద్దు చేస్తున్నట్లు సోమవారం ఓ కీలక ప్రకటన చేసింది. అంతేకాకుండా ఇకపై ఏ హోటల్ గానీ, రెస్టారెంట్ గానీ సర్వీస్ చార్జీలను వసూలు చేయరాదంటూ కఠిన ఆదేశాలు జారీ చేసింది.
ఏ బిల్లుకు అయినా జీఎస్టీ పన్ను వసూలు చేస్తున్న నేపథ్యంలో సర్వీస్ చార్జీ అనే మాటే ఉత్పన్నం కావొద్దన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యంగా తెలుస్తోంది. వస్తువులు, సేవలపై జీఎస్టీ పేరిట పన్ను వేస్తున్నప్పుడు ఇక హోటళ్లు, రెస్టారెంట్లు సర్వీస్ చార్జీల పేరిట అదనపు పన్ను వేస్తున్న వైనంపై దృష్టి సారించిన కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు సర్వీస్ చార్జీలు వసూలు చేయరాదంటూ ఆదేశాలు జారీ చేసింది.