విక్రమ్ ఆరోగ్య పరిస్థితిపై చెన్నై కావేరీ ఆసుపత్రి బులెటిన్ విడుదల
- ఈ మధ్యాహ్నం ఆసుపత్రిలో చేరిన విక్రమ్
- గుండెపోటు అంటూ ప్రచారం
- ఇప్పటికే వివరణ ఇచ్చిన మేనేజర్
- విక్రమ్ కు కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు లేవన్న కావేరీ ఆసుపత్రి
ప్రముఖ కథానాయకుడు విక్రమ్ ఛాతీలో అసౌకర్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు. అయితే, విక్రమ్ కు గుండెపోటు అంటూ ప్రచారం జరిగింది. ఇప్పటికే దీనిపై ఆయన మేనేజర్ వివరణ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో, చెన్నైలో విక్రమ్ కు చికిత్స అందిస్తున్న కావేరీ ఆసుపత్రి స్పందించింది. విక్రమ్ ఆరోగ్యంపై తాజా బులెటిన్ విడుదల చేసింది.
ఛాతీలో అసౌకర్యంగా ఉండడంతో విక్రమ్ తమ ఆసుపత్రిలో చేరినట్టు వెల్లడించింది. విక్రమ్ ను నిపుణులైన తమ ఆసుపత్రి వైద్యుల బృందం పరీక్షించిందని, అవసరమైన వైద్యం అందించిందని తెలిపింది. విక్రమ్ కు కార్డియాక్ అరెస్ట్ లక్షణాలేవీ లేవని, అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని వివరించింది. త్వరలోనే డిశ్చార్జి చేస్తామని కావేరీ ఆసుపత్రి తన ప్రకటనలో తెలిపింది.