లైవ్‌లో రిపోర్టింగ్ చేస్తుండగా కెమెరాకు చేయి అడ్డం పెట్టిన బాలుడు.. చెంప పగలగొట్టిన మహిళా జర్నలిస్ట్: వీడియో ఇదిగో

  • పాకిస్థాన్‌లో ఘటన
  • బక్రీద్ సందర్భంగా లైవ్ రిపోర్టింగ్
  • ఆమె తీరుపై నెటిజన్ల భిన్నాభిప్రాయాలు
లైవ్‌లో రిపోర్టింగ్ చేస్తుండగా కెమెరాకు చేయి అడ్డం పెట్టిన బాలుడు.. చెంప పగలగొట్టిన మహిళా జర్నలిస్ట్: వీడియో ఇదిగో
బక్రీద్‌ను పురస్కరించుకుని లైవ్‌లో రిపోర్టింగ్ చేస్తున్న ఓ మహిళా జర్నలిస్టు బాలుడి చెంపచెళ్లుమనిపించిన వీడియో సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. పాకిస్థాన్‌లో జరిగిందీ ఘటన. బక్రీద్ సందర్భంగా ఈ నెల 9న పండుగను ప్రజలు ఎలా జరుపుకుంటున్నదీ తెలియజేస్తూ మహిళా జర్నలిస్ట్ లైవ్ రిపోర్టింగ్ చేస్తోంది. ఈ క్రమంలో ఆమె చుట్టూ చేరిన వారిలో ఓ బాలుడు కెమెరాకు చేయి అడ్డం పెట్టాడు. అంతేకాదు, తన మిత్రుడిని కూడా అక్కడికి పిలవడంతో సహనం కోల్పోయిన ఆమె ఒక్కసారిగా బాలుడి చెంప చెళ్లుమనిపించింది.

అది చూసి అక్కడున్న వారితోపాటు లైవ్‌‌లో ఆ కార్యక్రమాన్ని తిలకిస్తున్న వారు కూడా షాకయ్యారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను ఇప్పటికే లక్షలాదిమంది వీక్షించారు. ఆమె తీరును కొందరు తప్పుబడుతుంటే, మరికొందరు మాత్రం సమర్థిస్తున్నారు. ఆ బాలుడు పరుష పదజాలం వాడినందుకే ఆమె చేయి చేసుకుందని చెబుతున్నారు. ఆ వీడియోను మీరూ చూసేయండి.


More Telugu News