కాలువ ఒడ్డున సీఎంతో బ్రేక్ ఫాస్ట్!... బీజేవైఎం నేతల ఫొటోలు ఇవిగో!
- కొండ ప్రాంతంలో కాలువ ఒడ్డున బ్రేక్ ఫాస్ట్
- బీజేవైఎం నేతలకు విందు ఇచ్చిన హిమాచల్ సీఎం
- ఫొటోలను షేర్ చేసిన బీజేవైఎం జాతీయ ప్రధాన కార్యదర్శి రోహిత్
అరుణాచల్ ప్రదేశ్ కొండలు, గుట్టలు, వాగులు, వంకలతో కూడిన రాష్ట్రం. వెరసి ప్రకృతి అందాలకు నెలవు అరుణాచల్ ప్రదేశ్. ప్రకృతి ప్రేమికులను ఇట్టే ఆకట్టుకుంటున్న ఆ రాష్ట్రానికి బీజేపీ యువజన విభాగం జాతీయ అధ్యక్షుడు, బెంగళూరు దక్షిణ ఎంపీ తేజస్వీ సూర్యతో కలిసి బీజేవైఎం జాతీయ ప్రధాన కార్యదర్శి రోహిత్ చాహల్ వెళ్లారు. వీరికి అరుణాచల్ సీఎంగా ఉన్న బీజేపీ నేత పెమా ఖండూ ఓ విందు కూడా ఇచ్చారు.
ఆ విందు ఎక్కడ జరిగిందో తెలుసా? కొండ ప్రాంతంలో ఓ కాలువ ఒడ్డున వీరికి పెమా ఖండు అల్పాహార విందు ఇచ్చారు. గలగల పారే కాలువ ఒడ్డున ఓ టేబుల్, మూడు కుర్చీలు ఏర్పాటు చేసిన ఖండూ... తేజస్వీ సూర్య, రోహిత్ చాహల్లకు అల్పాహార విందు ఇచ్చారు. ఈ విందుకు సంబంధించిన ఫొటోలను రోహిత్ చాహల్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.