మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లాలు, నియోజకవర్గాలను విడిచి రావొద్దు... సీఎం కేసీఆర్ ఆదేశాలు

  • తెలంగాణలో భారీ వర్షాలు
  • మరో రెండ్రోజులకు వర్ష సూచన
  • మంత్రులకు, ఎమ్మెల్యేలకు, అధికారులకు సీఎం దిశానిర్దేశం
గత కొన్నిరోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనిపై సీఎం కేసీఆర్ ప్రతిరోజూ సమీక్ష నిర్వహిస్తున్నారు. తాజాగా ఉన్నతస్థాయి సమీక్ష చేపట్టిన సీఎం కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లాలు, నియోజకవర్గాల్లోనే ఉండాలని స్పష్టం చేశారు. పలు ప్రాంతాలకు వరద ముప్పు ఉన్నందున ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

కాగా, గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో, వరద ముంపు ప్రమాదం ఉన్న జిల్లాలకు చెందిన మంత్రులు, కలెక్టర్లతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా మాట్లాడారు. ఆస్తి, ప్రాణ నష్టాలను నివారించే దిశగా చర్యలు ఉండాలని నిర్దేశించారు. రవాణా, విద్యుత్ శాఖల అధికారులతోనూ మాట్లాడి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తపడాలని సూచించారు.


More Telugu News