భారత సినీ చరిత్రలోనే తొలిసారిగా ‘పుష్ప’ ఆడియోకు 500 కోట్ల వ్యూస్

  • ఈ ఘనత సాధించిన తొలి చిత్రంగా రికార్డు
  • అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప'  
  • హీరోయిన్ గా నటించిన రష్మిక మందన్న 
  • త్వరలోనే సెట్స్ మీదకు  రెండో భాగం
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో గతేడాది వచ్చిన ‘పుష్ప’ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర ఘన విజయం సాధించింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం బాలీవుడ్‌ సహా భారీ వసూళ్లు దక్కించుకుంది. ఏకంగా రూ.300 కోట్ల వసూళ్లు సాధించింది.
 
 ఇక ఈ సినిమాలోని పాటలు ఏ స్థాయిలో పాప్యులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాంతో, బాక్సాఫీస్‌ విజయంతోనే ఈ సినిమా చరిత్ర ఆగిపోలేదు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యంలోని మ్యాజిక్‌ ఆల్బమ్‌ కొత్త రికార్డు సాధించింది. 
 
దాక్కో దాక్కో మేక, ఊ అంటావా మావా, శ్రీవల్లి, ఏయ్‌ బిడ్డా పాటలు అభిమానులను ఉర్రూతలగించాయి. దాంతో, ఈ సినిమాలోని మొత్తం పాటలన్నీ కలిపి 500 కోట్ల వ్యూస్‌ ను దక్కించుకున్నాయి. భారత దేశంలో మరే సినిమా మ్యూజిక్ ఆల్బమ్ కు ఈ స్థాయి వ్యూస్ రాలేదు. దాంతో, పుష్ప అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఇక మొదటి భాగం ఇచ్చిన ఉత్సాహంతో త్వరలోనే ‘పుష్ప 2’ సెట్స్‌ మీదకు వెళ్లనుంది.


More Telugu News