అరెస్ట్ చేయకుండా ఆపండి!... సుప్రీంకోర్టులో నుపుర్ శర్మ పిటిషన్!
- మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపుర్
- వివాదం రేగడంతో నుపుర్ను బహిష్కరించిన బీజేపీ
- కేసులన్నింటిని ఒకే కేసుగా మార్చాలని అభ్యర్థన
- తనకు ప్రాణహాని ఉందని కోర్టుకు నివేదన
వివాదాస్పద వ్యాఖ్యల వివాదంలో చిక్కుకున్న బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ సోమవారం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా నిలువరించాలని కోరుతూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా తనపై నమోదైన అన్ని కేసులను ఒకే కేసుగా మార్చాలని కూడా ఆమె తన పిటిషన్లో సుప్రీంకోర్టును అభ్యర్థించారు.
ఈ పిటిషన్లో నుపుర్ శర్మ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని కూడా ఆమె కోర్టుకు తెలిపారు. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ వివాదం నేపథ్యంలోనే బీజేపీ ఆమెను బహిష్కరించింది. నుపుర్ శర్మ పిటిషన్పై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.