‘నీట్’ ఎగ్జామ్ సెంటర్‌లో అమ్మాయిల లోదుస్తులు తొలగించిన ఆరోపణలు.. కేసు నమోదు చేసిన పోలీసులు
- కేరళలోని కొల్లాం జిల్లాలో నిర్వహించిన పరీక్షలో ఘటన
- మెటల్ హుక్స్ కారణంగా లోదుస్తులు విప్పేయించిన సిబ్బంది
- బాలిక తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు
- త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామన్న అధికారులు
వైద్య విద్య కోర్సుల ప్రవేశాల కోసం ఈ నెల 17న కేరళలోని కొల్లాం జిల్లా అయూర్‌లో నిర్వహించిన ‘నీట్’ పరీక్ష రాసేందుకు వచ్చిన అమ్మాయిలతో సిబ్బంది అవమానకరంగా వ్యవహరించిన తీరుపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనఖీల్లో అమ్మాయిల లోదుస్తులకు ఉన్న మెటల్ హుక్స్ కారణంగా బీప్ సౌండ్ రావడంతో లోదుస్తులను తొలగిస్తేనే కేంద్రంలోకి అనుమతిస్తామని తెగేసి చెప్పారు. దీంతో పరీక్ష రాసేందుకు వచ్చిన అమ్మాయిలు మరో దారిలేక స్టోర్ రూములో లోదుస్తులు విప్పి పరీక్ష రాయాల్సి వచ్చింది.
ఓ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సిబ్బంది తీరుపై సర్వత్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. బాధిత బాలిక తండ్రి ఫిర్యాదుతో భారత శిక్షాస్మృతిలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత బాలిక వాంగ్మూలాన్ని మహిళా అధికారుల బృందం నమోదు చేసిన తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు. ఈ చర్యకు పాల్పడిన వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు.