ఇకపై ఏ పార్టీలో చేరను: యశ్వంత్ సిన్హా
- ఇకపై ఇండిపెండెంట్ గానే ఉంటానన్న యశ్వంత్
- ప్రజా జీవితంలో ఎలాంటి పాత్ర పోషించాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడి
- ఎన్నికల తర్వాత తనతో ఎవరూ మాట్లాడలేదని వ్యాఖ్య
కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ రోజు ఆయన మాట్లాడుతూ, ఇకపై తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోనని, ఇండిపెండెంట్ గానే ఉంటానని చెప్పారు. ఇకపై ప్రజా జీవితంలో ఎలాంటి పాత్ర పోషించాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సిన్హా తెలిపారు. 84 ఏళ్ల ఈ వయసులో తాను ఎంత యాక్టివ్ గా ఉంటాననే విషయం ముఖ్యమని చెప్పారు. ఎంత కాలం తనలో శక్తి ఉంటుందో చూడాలని అన్నారు.
ఎన్నో ఏళ్ల పాటు సిన్హా బీజేపీలో కొనసాగిన సంగతి తెలిసిందే. మోదీ, అమిత్ షాల చేతిలోకి బీజేపీ పగ్గాలు పోయిన తర్వాత ఆయన పార్టీ నుంచి బయకు వచ్చారు. మమతా బెనర్జీ పార్టీ టీఎంసీలో చేరారు. రాష్ట్రపతి ఎన్నికల కోసం ఆయన టీఎంసీకి రాజీనామా చేశారు. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత తనతో ఎవరూ మాట్లాడలేదని, తాను కూడా ఎవరితో మాట్లాడలేదని చెప్పారు. వ్యక్తిగత కారణాల వల్ల టీఎంసీకి చెందిన ఒక నేతతో టచ్ లో ఉన్నానని తెలిపారు.