ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో చంద్రబాబుకు ఘన స్వాగతం.. ఫొటోలు ఇవిగో!
- విలీన మండలాలను ముంచెత్తిన వరద గోదావరి
- రెండు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న చంద్రబాబు
- ఈ రాత్రికి భద్రాచలంలో బస చేయనున్న టీడీపీ అధినేత
భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉగ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. గోదావరి నదికి వరద నీరు పోటెత్తింది. భారీ వరదల కారణంగా తెలంగాణ, ఏపీలోని గోదావరి పరీవాహక ప్రాంతంలో ఎన్నో గ్రామాలు నీట మునిగాయి. భద్రాచలం, చుట్టుపక్కల మండలాలన్నీ రోజుల పాటు వరద నీటిలోనే ఉండిపోయాయి. పోలవరం ప్రాజెక్టు విలీన మండలాలన్నీ నీట మునిగాయి. ఈ నేపథ్యంలో విలీన మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలలో టీడీపీ అధినేత పర్యటించనున్నారు. విలీన మండలాలకు ఆయన పయనమయ్యారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో టీడీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి.
ఈ రోజు ఏపీలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని శివకాశీపురం, కుక్కునూరు గ్రామాల్లో ఆయన పర్యటించనున్నారు. అలాగే తెలంగాణలోని బూర్గంపహాడ్ లో పర్యటించబోతున్నారు. రాత్రికి ఆయన భద్రాచలంలో బస చేయనున్నారు. రేపు ఏపీకి చెందిన ఎటపాక, వీఆర్ పురం, కూనవరం మండలాల్లోని కోతులగుట్ట, తోటపల్లి, రేఖపల్లి, కూనవరం ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తారు.