జీ మెయిల్ కు కొత్త రూపం.. వద్దనుకుంటే పాతదానికి మారే ఆప్షన్

  • ఎడమచేతి వైపు రెండు ప్యానెల్స్
  • ఒక వరుసలో జీమెయిల్, చాట్, మీట్ ఆప్షన్లు
  • రెండో వరుసలో కంపోజ్, ఇన్ బాక్స్ ఇతర ఆప్షన్లు
గూగుల్ సంస్థ జీమెయిల్ వెబ్ సైట్ వెర్షన్ కు కొత్త అప్ డేట్ ను ఆచరణలోకి తెస్తోంది. డిజైన్ లో కొన్ని మార్పులు చేసింది. ఇదే విషయాన్ని యూజర్లకు తెలియజేస్తోంది. అయితే కొత్త లుక్ నచ్చకపోతే.. యూజర్లు తిరిగి పాత సెట్టింగ్స్ కు మారిపోయే ఆప్షన్ కూడా ఇస్తున్నట్టు గూగుల్ తెలిపింది. గత జనవరిలో కొత్త జీమెయిల్ లుక్ గురించి గూగుల్ ప్రకటించింది. కాకపోతే స్టాండర్డ్ వెర్షన్ అని, పాతదానికి మారిపోయే ఆప్షన్ ఉండదని పేర్కొంది. కానీ, ఇప్పుడు మాత్రం నచ్చని వారికి పాత వెర్షన్ ను కూడా ఆఫర్ చేస్తోంది.

కొత్త జీమెయిల్ లుక్ లో.. ఎడమ చేతి వైపు రెండు ప్యానెల్స్ ఉంటాయి. అందులో ఒక వరుసలో జీమెయిల్, చాట్, మీట్ బటన్స్ కనిపిస్తాయి. మరో వరుసలో పైన కంపోజ్ పేరుతో పెద్ద బాక్స్ , దాని కింద ఇన్ బాక్స్ ఇతర మెయిల్ ఆప్షన్లు కనిపిస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా స్పామ్ మెయిల్స్, ఫిషింగ్, మాల్వేర్ నుంచి మెరుగైన రక్షణ కూడా గూగుల్ కల్పించింది. 


More Telugu News