ఢిల్లీలో కేసీఆర్ ను కలిసిన అఖిలేశ్ యాదవ్

  • ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్
  • రెండు గంటలకు పైగా సమావేశమైన కేసీఆర్, అఖిలేశ్
  • కేంద్ర ప్రభుత్వ విధానాలపై చర్చించిన నేతలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయనను సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కలిశారు. దాదాపు రెండు గంటలకు పైగా వీరిద్దరి సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా వీరిద్దరూ జాతీయ రాజకీయాలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, వాటిని ఎలా ఎదుర్కోవాలి? తదితర అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అఖిలేశ్ యాదవ్ వెంట రాంగోపాల్ యాదవ్ ఉన్నారు. మరోవైపు ఈ రాత్రి కేసీఆర్ హైదరాబాద్ కు తిరుగుపయనమయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.


More Telugu News