హంటర్... రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి మరో బైక్
- 350 సిరీస్ లో నూతన బైక్
- ఆగస్టు 7న ఆవిష్కరణ
- సరికొత్త జే ప్లాట్ ఫాంపై నిర్మాణం
- ధర రూ.1.6 లక్షల వరకు ఉండే అవకాశం
రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్, క్లాసిక్ 350 వంటి మోటార్ సైకిళ్లు ఎంత ప్రజాదరణ పొందాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత కొన్ని దశాబ్దాలుగా ఆ బైకులు ప్రజల హృదయాల్లో చెక్కుచెదరని స్థానం సంపాదించుకున్నాయి. తాజాగా రాయల్ ఎన్ ఫీల్డ్ కొత్త మోడల్ బైక్ ను తీసుకువచ్చేందుకు సన్నద్ధమవుతోంది. ఈ బైక్ పేరు హంటర్ 350. దీన్ని ఆగస్టు 7న లాంచ్ చేస్తున్నారు.
హంటర్ బైకును సరికొత్త జే ప్లాట్ ఫాంపై రూపొందిస్తున్నారు. దీని ధర ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, రూ.1.5 లక్షల నుంచి రూ.1.6 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. ప్రధానంగా కుర్రకారును దృష్టిలో ఉంచుకుని ఈ బైక్ ను డిజైన్ చేసినట్టు తెలుస్తోంది.