వరి మడిలో నాట్లు వేసిన వైఎస్ షర్మిల.. ఫొటోలు, వీడియో ఇదిగో
- ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర చేస్తున్న షర్మిల
- కొడంగల్ నియోజకవర్గంలో సాగుతున్న యాత్ర
- రైతు కూలీలతో కలిసి వరి నాట్లు వేసిన షర్మిల
- వ్యవసాయంలో మహిళల పాత్రను ఆకాశానికెత్తేసిన వైఎస్సార్టీపీ నేత
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పేరిట తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొడంగల్ నియోజకవర్గ పరిధిలో షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో భాగంగా గురువారం వరి మడుల్లోకి దిగిన షర్మిల... వరి నాట్లు వేస్తూ రైతులతో కలిసిపోయారు. మడుల్లో నాట్లు వేస్తున్న రైతు కూలీలతో కలిసి ఆమె నాట్లు వేశారు.
లాభనష్టాలు కాకుండా కష్టాన్ని నమ్ముకుని చేసేదే వ్యవసాయమని పేర్కొన్న షర్మిల.. వ్యవసాయాన్ని పండగ చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. మహిళలు లేనిదే వ్యవసాయం లేదన్న షర్మిల... వారి కష్టం వెలకట్టలేనిదని చెప్పారు. నాటు వేసింది మొదలు, పంట చేతికొచ్చే వరకు సగం పనులు మహిళలవేనని ఆమె తెలిపారు. వ్యవసాయమైనా, ఇల్లు అయినా, దేశాన్ని అయినా నడిపించడంలో మహిళలకు మహిళలే సాటి అని షర్మిల పేర్కొన్నారు.