శ్రీలంక కంటే ఏపీ అప్పులు ఎక్కువగా ఉన్నాయి: కాంగ్రెస్ నేత తులసిరెడ్డి
- మూడేళ్ల వైసీపీ పాలన దారుణంగా ఉందన్న తులసిరెడ్డి
- రాష్ట్రంలో అభివృద్ధి ఏమాత్రం లేదని విమర్శ
- రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని ఆరోపణలు
వైసీపీ పాలనపై కాంగ్రెస్ నేత, ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు. మూడేళ్ల వైసీపీ పాలన చాలా దారుణంగా ఉందని... పాలనను చూస్తే పిచ్చోడి చేతికి ఏకే47 ఇచ్చినట్టుందని విమర్శించారు. శ్రీలంక కంటే ఏపీలో అప్పులు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి ఏమాత్రం లేదని... సంక్షేమాల పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని అన్నారు.
వైసీపీని రాసలీలల పార్టీ అనాలా, కామాంధుల పార్టీ అనాలా, దిగంబర పార్టీ అనాలా అని ప్రశ్నించారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ పాదయాత్రను నిర్వహించింది. చిత్తూరు జిల్లా పలమనేరులో ప్రారంభమైన పాదయాత్ర బంగారుపాళ్యం, చిత్తూరు వీదుగా గంగాధరనెల్లూరు వరకు కొనసాగింది. పాదయాత్ర ముగింపు సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.