ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై ఈడీ కేసు నమోదు
- ఎక్సైజ్ పాలసీతో సిసోడియా అక్రమంగా సంపాదించారన్న సీబీఐ
- సీబీఐ కేసు ఆధారంగా మనీ ల్యాండరింగ్ ఆరోపణల కింద ఈడీ కేసు
- ఈ కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమైనవేనన్న ఆప్
ఢిల్లీలో లిక్కర్ స్కాంకు పాల్పడ్డారంటూ ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కేసు నమోదు చేసిన రోజుల వ్యవధిలోనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయనపై మనీ ల్యాండరింగ్ ఆరోపణల ఆధారంగా కేసు నమోదు చేసింది. ఈ మేరకు ఈడీ అధికారులు సిసోడియాపై మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారంటూ మంగళవారం కేసు నమోదు చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో తమకు అనుకూలంగా నిబంధనలు మార్చుకున్న సిసోడియా తదితరులు భారీ ఎత్తున అక్రమార్జనకు పాల్పడ్డారంటూ గత వారం సీబీఐ సిసోడియా సహా 14 మందిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
సీబీఐ దాఖలు చేసిన కేసును పరిశీలించిన ఈడీ అధికారులు మంగళవారం సిసోడియాపై కేసు నమోదు చేశారు. అయితే ఎక్సైజ్ పాలసీతో అక్రమంగా సంపాదించారంటూ సీబీఐ కేసు దాఖలు చేయగా... ఈడీ మాత్రం మనీ ల్యాండరింగ్‌కు సిసోడియా పాల్పడ్డారంటూ కేసు దాఖలు చేయడం గమనార్హం. మరోపక్క, సిసోడియాపై రాజకీయ కారణాలతోనే సీబీఐ, ఈడీల చేత బీజేపీ సర్కారు కేసులు నమోదు చేయిస్తోందని ఆప్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై ఏ తరహా విచారణకైనా తాను సిద్ధమేనని సిసోడియా కూడా స్వయంగా ప్రకటించారు.