‘కాలా చష్మా’ సాంగ్ కు హాంగ్ కాంగ్ క్రికెటర్ల అదిరిపోయే స్టెప్పులు
- 'ఆసియాకప్ 2022 గ్రూప్ ఏ'లో అర్హత సాధించిన హాంగ్ కాంగ్
- యూఏఈ జట్టుపై గెలుపుతో చోటు
- మ్యాచ్ అనంతరం కాలాచష్మా పాటకు హాంగ్ కాంగ్ క్రికెటర్ల డ్యాన్స్
ఆసియా కప్ 2022కు హాంగ్ కాంగ్ అర్హత సాధించింది. ఈ వారం ఆరంభంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించి ఆసియా కప్ గ్రూప్ ఏలో చోటు సంపాదించుకుంది. గ్రూప్ ఏలో పాక్, బారత్ తోపాటు హాంగ్ కాంగ్ కూడా ఉంది. ఈ నెల 31న భారత్ తో హాంగ్ కాంగ్ తలపడనుంది. ఆసియాకప్ 2022కు అర్హత సాధించడంతో హాంగ్ కాంగ్ క్రికెటర్లలో సంతోషం ఉరకలేసింది.
యూఏఈతో మ్యాచ్ ముగిసిన తర్వాత, వారు తమ అమితానందాన్ని ఆపుకోలేక బాలీవుడ్ హిట్ సినిమా ‘బార్ బార్ దేకో’లోని కాలా చష్మా పాటకు ఉత్సాహంగా స్టెప్పులేశారు. ఒకరికి మించి ఒకరు అలరించే విధంగా డ్యాన్స్ చేశారు. వికెట్ కీపర్ జీషన్ అలీ ఈ వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశాడు. దీంతో ఇది వైరల్ అవుతోంది. 2016లో వచ్చిన బార్ బార్ దేకో సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా, కత్రినాకైఫ్ తదితరులు నటించిన విషయం తెలిసిందే. కాలా చష్మా పాటకు ఓ వివాహం సందర్భంగా నార్వే ట్రూప్ చేసిన డ్యాన్స్ కూడా లోగడ వైరల్ అయింది. (ఇన్ స్టా గ్రామ్ వీడియో కోసం)