ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలియజేసిన ఏపీ సీఎం జగన్
- నేడు గణేశ్ చతుర్థి
- దేశవ్యాప్తంగా పండుగ కోలాహలం
- తెలుగు రాష్ట్రాల్లోనూ నవరాత్రి ఉత్సవ శోభ
- ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్టు సీఎం జగన్ ట్వీట్
నేడు దేశవ్యాప్తంగా వినాయకచవితి శోభ వెల్లివిరుస్తోంది. విఘ్నాలు తొలగించే గణేశుడ్ని ఆరాధిస్తూ నిర్వహించే నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. ఈ పుణ్య చతుర్థి పర్వదినాన తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలు భక్తిప్రపత్తులతో ఏకదంతుడ్ని కొలుస్తున్నారు. తొలిపూజలు అందుకునే ఈ శివపార్వతీ తనయుడికి ఇష్టమైన వంటకాలతో నైవేద్యాలు సిద్ధం చేసి వేడుకలకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలియజేశారు. విజ్ఞానం, వినయం, సకల శుభాలకు ప్రతీక గణనాథుడు అని పేర్కొన్నారు. విఘ్నాలను తొలగించి అభీష్టాలను నెరవేర్చే పూజ్యుడు విఘ్నేశ్వరుడు అని అభివర్ణించారు. ఆయన చల్లని ఆశీస్సులతో ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని, ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.