యాత్ర‌లో రాహుల్ బ‌స కోసం ల‌గ్జ‌రీ కంటైన‌ర్‌... వీడియో విడుద‌ల చేస్తూ విజ‌య‌సాయిరెడ్డి చురక!

  • క‌న్యాకుమారి నుంచి యాత్ర ప్రారంభించిన రాహుల్ గాంధీ
  • రాహుల్ బ‌స కోసం కంటైన‌ర్‌లో ఏర్పాట్లు చేసిన కాంగ్రెస్ పార్టీ
  • కంటైన‌ర్‌లోని వ‌స‌తులు తెలుపుతూ వీడియో విడుద‌ల చేసిన సాయిరెడ్డి
  • ఆ కంటైన‌ర్‌కు లగ్జ‌రీ ఆన్ వీల్స్ అంటూ పేరు పెట్టిన వైసీపీ ఎంపీ
2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ విజ‌య‌మే ల‌క్ష్యంగా ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర పేరిట భారీ పాద‌యాత్ర‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. త‌మిళ‌నాడులోని క‌న్యాకుమారి నుంచి క‌శ్మీర్‌లోని శ్రీన‌గ‌ర్ దాకా సాగ‌నున్న ఈ యాత్ర‌లో రాహుల్ గాంధీ ఏకంగా 3,570 కిలోమీటర్లు న‌డ‌వ‌నున్నారు. ఈ యాత్ర‌లో భారీ కంటైన‌ర్‌లో ఏసీ స‌దుపాయంతో రాహుల్‌ బ‌సకు ఏర్పాట్లు జ‌రిగాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.  

ఇందులో ఎలాంటి వ‌సతులు ఉన్నాయో చూపిస్తూ షూట్ చేసిన కంటైన‌ర్‌కు చెందిన ఓ వీడియోను వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి శ‌నివారం సోష‌ల్ మీడియా వేదిక‌గా విడుద‌ల చేశారు. 'ఇటీవల జరిగిన దేశ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు తన అభ్యర్థుల పేర్లను పేర్కొనే ముందు ప్రతిపక్షాలకు ఏమాత్రం తెలియజేయని కాంగ్రెస్ ఇప్పుడు ఐక్యత కోసం పిలుపునిచ్చింది. ఏమి జోక్ రాహుల్ జీ' అంటూ విజయసాయి చురక అంటించారు. ఇక ఈ కంటైన‌ర్‌కు ల‌గ్జ‌రీ ఆన్ వీల్స్ అంటూ సాయిరెడ్డి ఓ కొత్త పేరు కూడా పెట్టారు.


More Telugu News