మళ్లీ తల్లయిన సౌందర్య రజనీకాంత్.. పండంటి మగబిడ్డ జననం

  • రెండో బిడ్డకు జన్మనిచ్చిన సౌందర్య
  • వేద్‌కృష్ణకు తమ్ముడు పుట్టాడంటూ ట్వీట్
  • గతంలో వ్యాపారవేత్త అశ్వినీకుమార్‌తో ఒక బాబు
  • విడాకుల తర్వాత 2019లో విషగన్ వనంగమూడితో వివాహం
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ మళ్లీ తల్లయ్యారు. సౌందర్య-విషగన్ దంపతులు నిన్న మగబిడ్డకు జన్మనిచ్చారు. చిన్నారికి వీర్ రజనీకాంత్ వనంగమూడి అని నామకరణం చేశారు. సౌందర్య ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘దేవుని దయ, తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో  వేద్‌కృష్ణ తమ్ముడు వీర్ రజనీకాంత్ వనంగమూడికి విషగన్, వేద్, నేను స్వాగతం పలుకుతున్నాం. డాక్టర్ సుమన మనోహర్, డాక్టర్ శ్రీవిద్య శేషాద్రికి ధన్యవాదాలు’’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ మేరకు కొన్ని ఫొటోలను షేర్ చేశారు.

సౌందర్యకు గతంలో వ్యాపారవేత్త అశ్విన్ కుమార్‌తో వివాహమైంది. వీరికి వేద్‌కృష్ణ జన్మించాడు. అయితే, ఆ తర్వాత వీరు విడాకులు తీసుకున్నారు. అనంతరం 2019లో వ్యాపారవేత్త విషగన్ వనంగమూడిని సౌందర్య పెళ్లాడారు. తాజాగా, నిన్న వీరికి బాబు జన్మించాడు.


More Telugu News