గుడివాడలో రైతుల పాదయాత్ర ముగియడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు!

  • కొనసాగుతున్న అమరావతి రైతుల పాదయాత్ర
  • నేడు గుడివాడలో పాదయాత్ర
  • శరత్ టాకీస్ వద్ద స్వల్ప ఉద్రిక్తత
  • ఆ ఒక్క ఘటన మినహా పాదయాత్ర ప్రశాంతం
  • రేపటి పాదయాత్రపై పోలీసుల కసరత్తులు
అమరావతి రైతులు అరసవల్లి వరకు తలపెట్టిన మహా పాదయాత్ర ఇవాళ గుడివాడ చేరుకున్న సంగతి తెలిసిందే. కొద్దిసేపటి క్రితం గుడివాడలో రైతుల పాదయాత్ర ముగిసింది. స్వల్ప ఉద్రిక్తతలు మినహా పాదయాత్ర ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక, రేపటి పాదయాత్రలో తీసుకోవాల్సిన చర్యలపై పోలీసులు కసరత్తు ప్రారంభించారు. 

రేపు ఆదివారం గుడివాడ శివారు నాగవరప్పాడు నుంచి ఏలూరు జిల్లా కొన్నంకి వరకు అమరావతి రైతుల పాదయాత్ర కొనసాగనుంది. ఇవాళ గుడివాడలో రైతుల పాదయాత్ర సందర్భంగా 400 మందికి పైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


More Telugu News