ఒక తెలుగు సినిమా నుంచి చెప్పకుండానే నన్ను తీసేశారు: సీనియర్ హీరోయిన్ గీత

  • నిన్నటితరం గ్లామరస్ హీరోయిన్ గా గీత
  • కృష్ణ - శోభన్ బాబు జోడీగా ఎక్కువ సినిమాలు 
  • పెళ్లి తరువాత సినిమాలకి దూరం 
  • రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచన
గీత అనగానే నిన్నటితరం ప్రేక్షకుల మనసులను దోచుకున్న అందమైన కథానాయిక కళ్లముందు కదలాడుతుంది. జయసుధ .. జయప్రద .. శ్రీదేవి వంటి వారు కథానాయికలుగా దూసుకుపోతున్న సమయంలో, తన గ్లామర్ తో ఆ పోటీని తట్టుకుని నిలబడిన నాయిక ఆమె. అలాంటి గీత తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమం ద్వారా తన కెరియర్ కి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. 

"ఎన్టీ రామారావుగారికి చెల్లెలిగా 'సూపర్ మేన్' .. 'కొండవీటి సింహం' సినిమాలో ఆయనకి కోడలిగా నటించాను. ఏఎన్నార్ గారితో 'ఎస్.పి.భయంకర్' చేశాను. ఇక కృష్ణగారితో చాలా సినిమాలనే చేశాను. 'ఇద్దరూ అసాధ్యులే' సినిమాలో ముందుగా నన్ను చెల్లెలి పాత్ర కోసం అనుకున్నారు. కానీ హీరోయిన్ 'లత' గారు సమయానికి రాకపోవడంతో నాతో హీరోయిన్ గా చేయించారు. 

ఇక శోభన్ బాబుగారితో 'కోడళ్లు వస్తున్నారు జాగ్రత్త' .. 'అల్లుడు గారు జిందాబాద్' వంటి సినిమాలు చేశాను. ఇక ఒక తెలుగు సినిమా కోసం నన్ను తీసుకున్నారు. అప్పటికి మలయాళంలో నేను బిజీ. అయినా తెలుగులో మంచి బ్రేక్ వస్తుందనే ఉద్దేశంతో ఒప్పుకున్నాను. అయితే కారణం చెప్పకుండానే ఆ సినిమా నుంచి నన్ను తీసేశారు. అప్పుడు మాత్రం కొంచెం ఫీలయ్యాను. ఇప్పుడు బాధ్యతలు తీరాయి గనుక రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉన్నాను" అంటూ చెప్పుకొచ్చారు.


More Telugu News