రేపు టీఆర్ఎస్ కీల‌క స‌మావేశం...హాజ‌రు కానున్న‌ క‌ర్ణాట‌క మాజీ సీఎం, త‌మిళ‌నాడు వీసీకే పార్టీ అధినేత‌

  • రేపే జాతీయ రాజ‌కీయాల్లోకి టీఆర్ఎస్ ఎంట్రీ
  • కేసీఆర్ నేతృత్వంలో జ‌ర‌గ‌నున్న కీల‌క స‌మావేశం
  • స‌మావేశానికి హాజ‌రు కానున్న కుమార‌స్వామి, తిరుమావ‌ల‌వ‌న్
తెలంగాణ‌లో అధికార పార్టీ టీఆర్ఎస్ ద‌స‌రా ప‌ర్వ‌దినాన రేపు ఓ కీల‌క స‌మావేశాన్ని నిర్వ‌హించ‌నున్న సంగ‌తి తెలిసిందే. పార్టీకి జాతీయ రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశం క‌ల్పిస్తూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ స‌మావేశంలో కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా పార్టీకి ఆయ‌న కొత్త పేరును కూడా ప్ర‌క‌టించ‌నున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. 

ఈ స‌మావేశానికి టీఆర్ఎస్‌కు చెందిన కీల‌క నేత‌లందరితో పాటు పొరుగు రాష్ట్రాల‌కు చెందిన రాజ‌కీయ పార్టీల నేత‌లు కూడా హాజ‌రు కానున్నారు. ఈ స‌మావేశానికి జేడీఎస్ నేత‌, క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి హాజ‌రు కానున్నారు. త‌మిళ‌నాడుకు చెందిన విడుత్త‌లై చిరుత్తైగ‌ల్ క‌ట్చీ (వీసీకే) అధినేత‌, ఎంపీ తిరుమావ‌ల‌వ‌న్ కూడా హాజ‌రు కానున్నారు. మంగ‌ళ‌వార‌మే ఆయ‌న హైద‌రాబాద్ చేరుకోగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్‌, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిలు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.


More Telugu News