'ధృవ 2' సినిమాకి లైన్ క్లియర్ అయినట్టే!

  • తమిళంలో హిట్ కొట్టిన 'తనీ ఒరువన్'
  • తెలుగు రీమేక్ గా ఘన విజయాన్ని సాధించిన 'ధృవ'
  • సీక్వెల్ కథను రెడీ చేసిన మోహన్ రాజా 
  • రెండు భాషల్లోను తానే దర్శకత్వం చేయనున్నట్టు వెల్లడి
'గాడ్ ఫాదర్' సినిమా హిట్ కావడంతో ఇప్పుడు అందరూ కూడా దర్శకుడు మోహన్ రాజా గురించే మాట్లాడుకుంటున్నారు. కోలీవుడ్ లో దర్శకుడిగా మోహన్ రాజాకి మంచి ఇమేజ్ ఉంది. 2015లో అక్కడ ఆయన జయం రవి హీరోగా చేసిన 'తనీ ఒరువన్' సంచలన విజయాన్ని నమోదు చేసింది. 

ఆ సినిమాను చరణ్ హీరోగా తెలుగులో 'ధృవ' టైటిల్ తో తెరకెక్కించగా భారీ విజయాన్ని సాధించింది. అప్పటి నుంచి ఈ సినిమా సీక్వెల్ గురించిన వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. 'తనీ ఒరువన్ 2' స్క్రిప్ట్ పూర్తయిందని ఆ మధ్య మోహన్ రాజా చెప్పడంతో, మళ్లీ చరణ్ - సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో తెలుగు రీమేక్ వస్తుందని అంతా భావించారు. 

అయితే ఈ సినిమా సీక్వెల్ తమిళంతో పాటు తెలుగులో కూడా తానే చేయనున్నట్టు మోహన్ రాజా చెప్పడం విశేషం. ఇప్పటికే చరణ్ కి కథ వినిపించడం జరిగిపోయిందని ఆయన అన్నాడు. మోహన్ రాజా దర్శకత్వంలో 'ధృవ 2' ఉండనున్నట్టుగా నిర్మాత ఎన్వీ ప్రసాద్ కూడా ధృవీకరించారు. ఇక ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందనేది చూడాలి.


More Telugu News