అదే దూకుడు చూపుతున్న అందాల శ్రీలీల!
- శ్రీలీల తాజా చిత్రంగా రానున్న 'ధమాకా'
- షూటింగు దశలో రెండు సినిమాలు
- అనిల్ రావిపూడి సినిమాలో బాలయ్య కూతురుగా ఛాన్స్
- రామ్ సినిమాలోను దక్కిన అవకాశం
కృతి శెట్టి తరువాత తెలుగు తెరకి పరిచయమైన అందాల కథానాయిక శ్రీలీల. ఆమె తొలి చిత్రం 'పెళ్లి సందD' ఆశించిన స్థాయిని అందుకోలేకపోయినా, గ్లామర్ తో ఈ బ్యూటీ మనసులపై మత్తుపూలు చల్లేసింది. మొదటి సినిమాను కుర్రహీరోతో చేసిన ఈ సుందరి, రెండవ సినిమాను రవితేజ వంటి సీనియర్ స్టార్ హీరో సరసన చేయడం విశేషం. ఈ ఇద్దరి కాంబినేషన్ లో రూపొందిన 'ధమాకా' సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ఈ సినిమా విడుదలకు రెడీ అవుతూ ఉండగానే ఆమె బాలకృష్ణ కూతురుగా అనిల్ రావిపూడి సినిమాను చేయనుంది. ఈ విషయాన్ని అనిల్ రావిపూడి స్వయంగా వెల్లడించాడు. త్వరలో ఈ సినిమా పట్టాలెక్కనుండగా, 'జూనియర్' .. 'అనగనగా ఒక రోజు' సినిమాలను ఆమె లైన్లో పెట్టింది. ఈ రెండు సినిమాల షూటింగు కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో రామ్ సినిమా నుంచి ఆమెకి అవకాశం వెతుక్కుంటూ వెళ్లింది.
రామ్ హీరోగా బోయపాటి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా ఆమెను ఎంపిక చేసినట్టుగా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నాడు. రామ్ అభిమానులు కోరుకున్నంత మాస్ యాక్షన్ ఈ సినిమాతో లభించనుందని అంటున్నారు. 'అఖండ' వంటి సంచలనం తరువాత బోయపాటి చేస్తున్న సినిమా కావడంతో, సహజంగానే అందరిలోను అంచనాలు ఉన్నాయి.