ప్రపంచ కప్ గురించి టీమిండియా ఆటగాళ్లు ఎక్కువగా మాట్లాడుకోవడం లేదు: రోహిత్ శర్మ

  • ఆస్ట్రేలియాలో కొనసాగుతున్న టీ20 వరల్డ్ కప్
  • వరల్డ్ కప్ లో తొలిసారి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రోహిత్
  • చాలా ఎక్సైటింగ్ గా ఉందన్న టీమిండియా కెప్టెన్
టీ20 వరల్డ్ కప్ ప్రారంభమైనప్పటి నుంచి టీమిండియా ఒక్కసారి మాత్రమే టైటిల్ ను కైవసం చేసుకుంది. టోర్నీ ప్రారంభమైన తొలి ఏడాది 2007లో ఛాంపియన్ గా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ విజేతగా నిలవలేదు. 2011లో వన్డే ప్రపంచకప్ ను సాధించినప్పటికీ... టీ20 వరల్డ్ కప్ ను మాత్రం మళ్లీ సాధించలేకపోయింది. ఇప్పుడు ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ జరుగుతున్న సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ కప్ ఆడుతున్నామనే విషయం గురించి మన ఆటగాళ్లు ఎక్కువగా మాట్లాడుకోవడం లేదని చెప్పాడు. 

జట్టుకు నాయకత్వం వహించడం గొప్ప గౌరవమని రోహిత్ అన్నాడు. కెప్టెన్ గా ఇది తనకు తొలి వరల్డ్ కప్ అని, తనకు చాలా ఎక్సైటింగ్ గా ఉందని చెప్పాడు. ప్రపంచకప్ ఆడే ప్రతిసారి ఎంతో గొప్ప అనుభూతి కలుగుతుందని అన్నాడు. మన ఆటగాళ్లు ఆటలో లీనమైపోయారని... పెర్త్ లో ప్రపంచకప్ కు బాగా ప్రిపేర్ అయ్యామని చెప్పాడు. 

ప్రపంచకప్ అనేది చాలా పెద్ద టోర్నీ అయినప్పటికీ... ఆటగాళ్లం ప్రత్యేకంగా దాని గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం లేదని రోహిత్ అన్నాడు. టోర్నీ గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం కంటే.. మ్యాచ్ జరిగే రోజున ఏం చేయాలని ఆలోచించడమే ముఖ్యమని చెప్పాడు.


More Telugu News