'ఓరి దేవుడా' ఒకసారి చూస్తే .. రెండోసారి కూడా చూడాలనిపిస్తుంది: విష్వక్సేన్
- నిన్న విడుదలైన 'ఓరి దేవుడా'
- ఈ రోజున జరిగిన సక్సెస్ మీట్
- ఆనందాన్ని వ్యక్తం చేసిన విష్వక్
- సంగీత దర్శకుడికి ప్రశంసలు
విష్వక్సేన్ ... మిథిల .. ఆషా భట్ ప్రధానమైన పాత్రలను పోషించిన 'ఓరి దేవుడా' నిన్ననే థియేటర్లకు వచ్చింది. వెంకటేశ్ ఒక ప్రత్యేకమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి అశ్వథ్ మారిముత్తు దర్శకత్వం వహించాడు. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ సక్సెస్ మీట్ ను నిర్వహించింది.
ఈ స్టేజ్ పై విష్వక్ మాట్లాడుతూ .. 'ఓరి దేవుడా' .. నిజంగానే ఫెస్టివల్ ఫిల్మ్ అనిపించుకుంది. ఈ సినిమా ఒకసారి చూసినవారికి మళ్లీ ఇంకోసారి చూడాలనిపిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయినట్టుగా అన్ని ఏరియాల నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ సినిమాను నేను ఆడియన్స్ తో కలిసి చూశాను. సెకండాఫ్ ను లియోన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పైకి లేపాడని అనిపించింది" అని అన్నాడు.
"ఈ సినిమా నుంచి మేము ఇంకా రెండు పాటలను రిలీజ్ చేయవలసి ఉంది. ఈ సినిమాలో చేసిన హీరోయిన్స్ కి తెలుగులో మంచి ఫ్యూచర్ ఉంటుంది. వెంకటేశ్ కాకుమానుతో కలిసి నటించేటప్పుడు నేనే నవ్వు ఆపుకోలేకపోయాను. కమెడియన్ గా ఆయన బిజీ అవుతాడని నమ్మకం నాకు ఉంది. దీపావళి కానుకగా వచ్చిన ఈ సినిమాను ఎవరూ మిస్ కావొద్దు" అంటూ చెప్పుకొచ్చాడు.