ఈ ఆలయాలపై గ్రహణం ప్రభావం చూపదట... అందుకే తెరిచి ఉంచుతారు!
- రేపు దేశంలో పాక్షిక సూర్యగ్రహణం
- ప్రముఖ ఆలయాల మూసివేత
- కొన్ని ఆలయాలకు మినహాయింపు
అక్టోబరు 25న సూర్యగ్రహణం కారణంగా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు మూతపడనున్నాయి. గ్రహణ ఘడియలు ముగిసిన తర్వాత సంప్రోక్షణ, ప్రదోష కాలపు పూజలు నిర్వహించి ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. అయితే, కొన్ని ఆలయాలపై గ్రహణాలు ఎలాంటి ప్రభావాన్ని చూపవు. అందుకే ఆ ఆలయాలను సూర్యగ్రహణం, చంద్ర గ్రహణం సమయాల్లోనూ తెరుస్తారు.
అలాంటి ఆలయాలు ఏపీలోనూ ఉన్నాయి. శ్రీకాళహస్తి క్షేత్రం, కర్నూలు జిల్లా సంగమేశ్వర ఆలయం గ్రహణం వేళ కూడా తెరిచే ఉంటాయి. పూజాదికాలు యథావిధిగా నిర్వరిస్తారు. శ్రీకాళహస్తి ఆలయంలో గ్రహణం వేళ ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. ఇక్కడి ధృవమూర్తులకు శాంతి అభిషేకాలు నిర్వహిస్తారు. ఇక, సంగమేశ్వర ఆలయంలో సూర్య గ్రహణం రోజున అరుణ హోమం చేపడతారు.
ఇవే కాదు, కేరళలోని తిరువరుప్పు క్షేత్రం, మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంపైనా గ్రహణం ప్రభావం చూపదు. అయితే, ఉజ్జయిని మహంకాళి ఆలయంలో గ్రహణం వేళ ప్రధాన ద్వారాలన్నీ తెరిచే ఉంచినా, శివలింగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తాకనివ్వరు. పూజలు, అభిషేకాలను గ్రహణ వేళల్లో నిలిపివేస్తారు.