నానీ మాదిరిగా సంతోష్ స్టార్ అవుతాడు: బ్రహ్మాజీ
- మేర్లపాక గాంధీ చిత్రంగా 'లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్'
- సంతోష్ శోభన్ జోడీకట్టిన ఫరియా అబ్దుల్లా
- నానీతో సంతోష్ శోభన్ ను పోల్చిన బ్రహ్మాజీ
- నవంబర్ 4వ తేదీన సినిమా రిలీజ్
సంతోష్ శోభన్ - ఫరియా అబ్దుల్లా జంటగా 'లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్' సినిమా రూపొందింది. గతంలో 'శ్యామ్ సింగరాయ్' సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను నిర్మించాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, ప్రవీణ్ లక్కరాజు సంగీతాన్ని సమకూర్చాడు. నవంబర్ 4వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించారు. చీఫ్ గెస్టుగా నాని హాజరయ్యాడు.
ఈ వేదికపై దర్శకుడు మేర్లపాక గాంధీ మాట్లాడుతూ .. " సంతోష్ శోభన్ కోసమే ఈ కథ పుట్టిందేమోనని నేను అనుకుంటున్నాను. తన పేరు ఒకటి రెండు సినిమాలతో ఆగిపోయేది కాదు. ఆయన పేరు లైఫ్ లాంగ్ గట్టిగా వినిపిస్తోందని భావిస్తున్నాను. ఫరియా చాలా మంచి అమ్మాయి .. తనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇక బ్రహ్మాజీ విషయానికి వస్తే ఆయన నట విశ్వరూపం చూస్తారు" అని అన్నాడు.
బ్రహ్మాజీ మాట్లాడుతూ .. "గాంధీ ప్రతి సినిమాలో నన్ను తీసుకుంటూ ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాడు. సంతోష్ శోభన్ ను చూస్తుంటే, పదేళ్ల క్రితం నానీని చూస్తున్నట్టుగా ఉంది. భవిష్యత్తులో నాని అంతటి పెద్ద స్టార్ అవుతాడని అనుకుంటున్నాను. ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతుంది. నాన్ స్టాప్ గా మీరు నవ్వుతూనే ఉంటారు" అంటూ చెప్పుకొచ్చాడు.