అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన శరద్ పవార్
- ముంబయి బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స
- పవార్ మూడ్రోజులు ఆసుపత్రిలోనే ఉంటారన్న ఎన్సీపీ
- నవంబరు 2న డిశ్చార్జి అవుతారని వివరణ
- ఆసుపత్రి బయటన పార్టీ శ్రేణులు గుమికూడవద్దని స్పష్టీకరణ
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ ఆసుపత్రిలో చేరారు. ఆయన అనారోగ్యం బారినపడడంతో ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎన్సీపీ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఆరోగ్యం దెబ్బతినడంతో పవార్ ఆసుపత్రిలో చేరారని వెల్లడించింది. ఆసుపత్రి వెలుపల ఎన్సీపీకి చెందిన నేతలు కానీ, కార్యకర్తలు కానీ గుమికూడరాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం పవార్ కోలుకుంటున్నారని, నవంబరు 2న డిశ్చార్జి అయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది. అంతేకాదు, నవంబరు 4, 5 తేదీల్లో షిరిడీలో నిర్వహించే పార్టీ శిబిరాల్లోనూ పాల్గొంటారని తెలిపింది.