పవన్ కల్యాణ్ ఇంటివద్ద రెక్కీ చేస్తారా... బతకనివ్వరా?: చంద్రబాబు

  • పవన్ ఇంటివద్ద అనుమానాస్పద వాహనాలు
  • కొత్త వ్యక్తుల సంచారం.. స్పందించిన చంద్రబాబు
  • ఎవరిని బెదిరిస్తారంటూ ఆగ్రహం
టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు చింతకాయల రాజేష్ లను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇంటివద్ద అనుమానాస్పద వ్యక్తుల సంచారంపైనా ఈ మీడియా సమావేశంలో చంద్రబాబు స్పందించారు. 

"పవన్ కల్యాణ్ ఎక్కడో ఉంటే... ఆయన మీద దాడి చేస్తారంట, రెక్కీ చేస్తారంట! ఎవరిని బెదిరిస్తారు మీరు? రాష్ట్రంలో అందరినీ చంపేస్తారా? అందరినీ జైల్లో పెట్టి కొడతారా? టార్చర్ చేస్తారా మీరు?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇప్పుడు కూడా రాజేష్ ను కొట్టారు... దీనిపై మాకు సమాచారం అందింది అని మండిపడ్డారు. దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. "ఏమనుకుంటున్నారు మీరు? ఇలాంటివి చూస్తే కంపరం కలుగుతుంది, బాధ, ఆవేశం కలుగుతున్నాయి. కానీ సభ్యత అడ్డం వస్తోంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టానుసారం ప్రవర్తిస్తున్న అధికారులకు చెబుతున్నా... మీరనుకున్నది జరగదు, జరగనివ్వం" అని చంద్రబాబు స్పష్టం చేశారు.


More Telugu News