ఫ్రీడం బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లను తొలగించనున్న బీఎస్ఎన్ఎల్
- భారత్ లో 75 వసంతాల స్వాతంత్ర్య వేడుకలు
- ఫ్రీడం-75 పేరిట బీఎస్ఎన్ఎల్ ప్రారంభ ఆఫర్లు
- 75 రోజుల కాలపరిమితితో ప్లాన్లు
- ప్లాన్లను అప్ గ్రేడ్ చేస్తున్న బీఎస్ఎన్ఎల్
భారతావని 75 వసంతాల స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఫ్రీడం పేరిట పలు ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లను తీసుకువచ్చింది. అయితే ఇవి ప్రత్యేక ఆఫర్లు కావడంతో వీటిని బీఎస్ఎన్ఎల్ తొలగిస్తోంది. వీటిస్థానంలో ప్రత్యామ్నాయ టారిఫ్ ప్లాన్లను తీసుకువస్తోంది.
తొలగిస్తున్న ప్లాన్లు ఇవే...
ఫ్రీడం 75- ఫైబర్ సూపర్ ప్లాటినమ్ ప్లస్
ఈ ప్లాన్ తో అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయంతో 2,000 జీబీ డేటా లభిస్తుంది. డేటా పరిమితి ముగిసేవరకు 150 ఎంబీపీఎస్ స్పీడుతో ఇంటర్నెట్ సేవలు పొందవచ్చు. డేటా పరిమితి ముగిశాక స్పీడు 10 ఎంబీపీఎస్ కు పడిపోతుంది. ఈ ప్లాన్ ద్వారా డిస్నీ ప్లస్ హాట్ స్టార్, లయన్స్ గేట్, షిమారూ, హంగామా, సోనీ లివ్, జీ5, వూట్, యుప్ టీవీ యాప్ ల సబ్ స్క్రిప్షన్లను ఉచితంగా పొందే వీలుండేది. ఈ ప్లాన్ కోసం రూ.775 చెల్లించాల్సి వచ్చేది.
ఇప్పుడు ఇదే ఫీచర్లతో ఉన్న ప్రత్యామ్నాయ ప్లాన్ కావాలంటే బీఎస్ఎన్ఎల్ లో రూ.999 ప్లాన్ ఒక్కటే కనిపిస్తోంది. ఇందులో 150 ఎంబీపీఎస్ స్పీడు, అన్ లిమిటెడ్ కాలింగ్, పెద్ద సంఖ్యలో ఓటీటీ యాప్ ల బెనిఫిట్స్ లభిస్తాయి. ఇంతకంటే తక్కువలో రూ.749, రూ.799 ప్లాన్లు ఉన్నా, అవి 100 ఎంబీపీఎస్ స్పీడు మాత్రమే అందిస్తాయి.
ఫ్రీడం-75 ఫైబర్ బేసిక్ ప్లస్
ఈ ప్లాన్ లో 60 ఎంబీపీఎస్ స్పీడుతో 3,330 జీబీ డేటా అందిస్తారు. డేటా పరిమితి ముగిశాక స్పీడు 4 ఎంబీపీఎస్ కు పడిపోతుంది. అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయం ఉంటుంది. దీనికి 75 రోజులకు గాను రూ.275 చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ ప్లాన్ ను వినియోగిస్తున్న బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఆటోమేటిగ్గా కొత్త ప్లాన్ ఫైబర్ బేసిక్ ప్లస్ ఎఫ్ఎంసీ 599కి అప్ గ్రేడ్ అవుతారు.
ఫ్రీడం-75 ఫైబర్ బేసిక్
ఇందులో స్పీడు 30 ఎంబీపీఎస్ మాత్రమే. అన్ లిమిటెడ్ కాలింగ్ తో పాటు 3,300 జీబీ డేటా అందిస్తారు. ఇప్పుడీ ప్లాన్ ఆటోమేటిగ్గా ఫైబర్ బేసిక్ ఎఫ్ఎంసీ 449 నెలవారీ ప్లాన్ గా మారిపోతుంది.
ఇప్పుడు ఇదే ఫీచర్లతో ఉన్న ప్రత్యామ్నాయ ప్లాన్ కావాలంటే బీఎస్ఎన్ఎల్ లో రూ.999 ప్లాన్ ఒక్కటే కనిపిస్తోంది. ఇందులో 150 ఎంబీపీఎస్ స్పీడు, అన్ లిమిటెడ్ కాలింగ్, పెద్ద సంఖ్యలో ఓటీటీ యాప్ ల బెనిఫిట్స్ లభిస్తాయి. ఇంతకంటే తక్కువలో రూ.749, రూ.799 ప్లాన్లు ఉన్నా, అవి 100 ఎంబీపీఎస్ స్పీడు మాత్రమే అందిస్తాయి.