మంత్రి సబితకు గవర్నర్ తమిళిసై అపాయింట్ మెంట్
- సాయంత్రం 5 గంటలకు అపాయింట్ మెంట్
- యూనివర్శిటీల్లో ఉమ్మడి నియామక బోర్డు విషయంలో సందేహాలున్నాయన్న గవర్నర్
- వచ్చి వివరణ ఇవ్వాలంటూ ఆదేశం
తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి గవర్నర్ తమిళిసై అపాయింట్ మెంట్ లభించింది. సాయంత్రం 5 గంటలకు గవర్నర్ ను సబిత కలవబోతున్నారు. విశ్వావిద్యాలయాల్లో ఉమ్మడి నియామక బోర్డు విషయంలో తనకు సందేహాలు ఉన్నాయని... వాటిని నివృత్తి చేయాలని ప్రభుత్వాన్ని ఇటీవల గవర్నర్ కోరారు. విద్యాశాఖ మంత్రి, అధికారులు వచ్చి వివరణ ఇవ్వాలంటూ ఆమె లేఖ రాశారు.
దీంతో, గవర్నర్ ను కలిసేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు అపాయింట్ మెంట్ కోరారు. ఈ నేపథ్యంలో వారికి గవర్నర్ అపాయింట్ మెంట్ లభించింది. మరోవైపు, శాసనసభ ఆమోదించిన పలు బిల్లులను గవర్నర్ తొక్కిపెడుతున్నారంటూ పలువురు నేతలు విమర్శలు గుప్పించారు. ఫైల్స్ ను ఎక్కువ కాలం తొక్కిపెట్టడం మంచిది కాదని సీపీఐ నారాయణ కూడా అన్నారు.