కేపీహెచ్బీలో వ్యభిచార ముఠాపై పోలీసుల మెరుపుదాడి
- పక్కా సమాచారంతో ఓ ఇంటిపై దాడిచేసిన యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ బృందం
- విటుడు, యువతి, అందులో పనిచేసే యువకుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు
- పరారీలో వ్యభిచార గృహ నిర్వాహకుడు
హైదరాబాద్ కేపీహెచ్బీలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ బృందం దాడి చేసింది. కాలనీలోని రోడ్ నంబరు 2, 3 మధ్యనున్న ఓ ఇంట్లో జోరుగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పక్కా సమాచారాన్ని అందుకున్న అధికారులు ఆ ఇంటిపై మెరుపుదాడి నిర్వహించారు. ఆ సమయంలో ఓ విటుడు, యువతితోపాటు ఉన్న అక్కడ పనిచేస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న ప్రధాన నిందితుడు పరారయ్యాడు. అదుపులోకి తీసుకున్న ముగ్గురినీ వారు కేపీహెచ్బీ పోలీసులకు అప్పగించారు. అనంతరం యువతిని పోలీసులు రెస్క్యూ హోంకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న వ్యభిచార గృహ నిర్వాహకుడి కోసం గాలిస్తున్నారు.