కృష్ణ అసలు పేరు ఏమిటో తెలుసా?
- 1942 మే 31న రైతు కుటుంబంలో జన్మించిన కృష్ణ
- ఆయన అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి
- కృష్ణగా ఆయన పేరును కుదించిన ఆదుర్తి సుబ్బారావు
సూపర్ స్టార్ కృష్ణ గుంటూరు జిల్లా తెనాలికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుర్రిపాలెంలో ఒక రైతు కుటుంబంలో 1942 మే 31న జన్మించారు. ఘట్టమనేని వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతులకు ఆయన పెద్ద కుమారుడు. కృష్ణకు తల్లిదండ్రులు పెట్టిన పేరు శివరామకృష్ణమూర్తి. సినీ రంగంలోకి ప్రవేశించిన తర్వాత ఆదుర్తి సుబ్బారావు ఆయన పేరును కృష్ణగా కుదించారు. ఆ తర్వాత ఆయన సూపర్ స్టార్ కృష్ణగా అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
ఎన్టీఆర్ తో కృష్ణకు కొన్ని విషయాల్లో విభేదాలు ఉన్నప్పటికీ... చిన్నతనం నుంచి కూడా ఎన్టీఆర్ అంటే కృష్ణకు ఎంతో అభిమానం. ఎన్టీఆర్ నటించిన చిత్రాల్లో 'పాతాళభైరవి' అంటే కృష్ణకు చాలా ఇష్టం. కృష్ణ మరణంతో తెలుగు రాష్ట్రాలలో విషాదఛాయలు అలముకున్నాయి.