వర్షం ఎఫెక్ట్ తో టైగా ముగిసిన మ్యాచ్... సిరీస్ విజేత టీమిండియా
- నేపియర్ లో వరుణుడి జోరు
- నిలిచిపోయిన మ్యాచ్
- డీఎల్ఎస్ ప్రకారం ఇరుజట్ల స్కోర్లు సమం
- మ్యాచ్ టై అయినట్టు ప్రకటించిన రిఫరీ
నేపియర్ లో టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ టైగా ముగిసింది. వర్షం కారణంగా మ్యాచ్ మధ్యలోనే నిలిచిపోవడంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతి వర్తింపజేశారు.
మ్యాచ్ నిలిచిపోయే సమయానికి టీమిండియా 9 ఓవర్లలో 4 వికెట్లకు 75 పరుగులు చేసింది. ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ కొనసాగించే వీల్లేకుండా పోయింది. మ్యాచ్ నిలిచే సమయానికి డక్ వర్త్ లూయిస్ విధానం ప్రకారం ఇరుజట్ల స్కోర్లు సమం అయ్యాయి. దాంతో మ్యాచ్ టై అయినట్టు రిఫరీ ప్రకటించారు. ఈ ఫలితం టీమిండియాకు లాభించింది. సిరీస్ ను 1-0తో కైవసం చేసుకుంది.
ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దయిపోగా, రెండో మ్యాచ్ లో టీమిండియా గెలిచింది. ఇవాళ్టి మ్యాచ్ కూడా వరుణుడి ఖాతాలో చేరిన నేపథ్యంలో, టీమిండియానే సిరీస్ విజేతగా అవతరించింది.
నేటి మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని, 19.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌట్ అయింది. కాన్వే 59, ఫిలిప్స్ 54 పరుగులు చేశారు. సిరాజ్, అర్షదీప్ చెరో 4 వికెట్లు తీసి సత్తా చాటారు. అనంతరం, టీమిండియా 161 లక్ష్యంతో బరిలో దిగింది. 9 ఓవర్ల వద్ద వర్షం రావడంతో మ్యాచ్ కు ఆగిపోయింది.