ఇస్రో ఖాతాలో మరో విజయం.. ఒకేసారి తొమ్మిది ఉపగ్రహాల ప్రయోగం 

  • పీఎస్ఎల్వీ సీ54 మిషన్ ప్రయోగం సక్సెస్
  • 8 సూక్ష్మ ఉపగ్రహాలు కాగా, ఒకటి ఇస్రో అభివృద్ధి చేసింది
  • శ్రీహరి కోట నుంచి జరిగిన ప్రయోగం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో విజయాన్ని నమోదు చేసింది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) సీ54 ఉపగ్రహ వాహక నౌక ఒకేసారి 9 శాటిలైట్లను (ఉపగ్రహాలు) అంతరిక్షంలోకి విజయవంతంగా తీసుకెళ్లింది. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా శ్రీహరి కోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ రోజు ఈ ప్రయోగం జరిగింది.

ఈ రాకెట్ ద్వారా ప్రయోగించిన తొమ్మిదింటిలో ఎనిమిది నానో శాటిలైట్లు కావడం గమనార్హం. వీటిని ప్రైవేటు కంపెనీలు తయారు చేశాయి. అలాగే, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ -06ను ఇస్రో అభివృద్ధి చేసింది. సముద్ర వాతావరణ పరిస్థితులను ఇది అధ్యయనం చేస్తుంది. భూటాన్ కు సంబంధించి నానో శాటిలైట్-2 కూడా ప్రయోగించిన వాటిల్లో ఒకటి.


More Telugu News