కమెడియన్ కి క్రికెట్ బ్యాట్ గిఫ్ట్ ఇచ్చిన హీరో విజయ్

  • క్రికెట్ అంటే యోగిబాబుకు చాలా ఇష్టం
  • క్రికెట్ బ్యాట్, హెల్మెట్ పంపించిన విజయ్
  • విజయ్ గిఫ్ట్ తో మురిసిపోయిన యోగిబాబు
తమిళ సినీ పరిశ్రమలో హీరో విజయ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. రజనీకాంత్ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న హీరో విజయ్. విజయ్ ఏం చేసినా తమిళనాడులో ఒక పెద్ద న్యూస్ అవుతుంది. తాజాగా కమెడియన్ యోగిబాబుకు విజయ్ గిఫ్ట్ పంపించాడు. క్రికెట్ బ్యాట్, హెల్మెట్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు. విజయ్ గిఫ్ట్ తో యోగిబాబు మురిసిపోయాడు. సోషల్ మీడియా వేదికగా ఫోటో ను షేర్ చేసి, తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. యోగిబాబుకు క్రికెట్ అంటే ఇష్టమని తెలుసుకున్న విజయ్... ఆయనకు క్రికెట్ కిట్ ను పంపించాడు. 

మరోవైపు, విజయ్, యోగిబాబు కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. విజయ్ తాజా చిత్రం 'వరిసు'లో కూడా యోగిబాబు నటించాడు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా, తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించారు. విజయ్ సరసన రష్మిక మందన్న నటించింది. ఇతర ముఖ్య పాత్రల్లో మీనా, ఖుష్బూ, జయసుధ, శ్రీకాంత్, శరత్ కుమార్ తదితరులు నటించారు.


More Telugu News