స్కూలు ఆవరణల్లో సచివాలయ నిర్మాణాలపై ఏపీ హైకోర్టులో విచారణ
- పాఠశాల ప్రాంగణాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు
- హైకోర్టులో పిటిషన్లు
- ఈ నెల 22న కోర్టుకు రావాలంటూ సీఎస్ కు హైకోర్టు ఆదేశం
ఏపీలోని పలు పాఠశాలల ప్రాంగణాల్లో సచివాలయ భవనాలు నిర్మిస్తుండడంపై నేడు హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో ఈ నెల 22న కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ఏపీ సీఎస్ ను హైకోర్టు ఆదేశించింది.
స్కూలు ఆవరణల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు నిర్మించవద్దని గతంలో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. పిటిషనర్లు ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించారని వెల్లడించారు. దీనిపై స్పందించిన హైకోర్టు ధర్మాసనం... హైకోర్టు ఆదేశించినా భవనాలు నిర్మించడంపై వివరణ ఇవ్వాలని సీఎస్ కు స్పష్టం చేసింది.